Pooja Hegde: కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్.! ఇప్పుడే దారిలోకి..
కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఆ మధ్య పాన్ ఇండియా ఆశలతో వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజా, ఆ తరువాత చాలా రోజులు ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది.