Neha Shetty: షారుఖ్ తో పోల్చుకున్న రాధిక.. అందుకే అన్ని అలాంటి క్యారెక్టర్స్..
బాలీవుడ్ బాద్షాకి, టిల్లు రాధికకీ ఓ మంచి పోలిక చెబుతున్నారు మిస్ నేహా శెట్టి. అదెలా సాధ్యం? ఒకవేళ కుదిరిందనే అనుకున్నా... ఏ విషయంలో... ఇలా రకరకాల అనుమానాలకు తెర తీసేశారు నేహా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న నేహా.. ఈ మధ్య మీడియా ముందుకు తరచూ వచ్చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నైన్‌టీస్ టైమ్ రిచ్ కిడ్‌గా కనిపిస్తారు నేహా శెట్టి.