
సౌత్ సినిమాతో ఫిలిం జర్నీ స్టార్ట్ చేసినా నార్త్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీ కృతి సనన్. గ్లామర్ ఇమేజ్ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ బ్యూటీ.

అంతేకాదు తన లైఫ్ మార్చేసిన మూమెంట్‌ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు కృతి సనన్.

అయితే ఈ క్రెడిట్ అంతా ఆ ఒక్క సినిమాదే అంటున్నారు ఈ బ్యూటీ. గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో రిస్క్ చేసి మరీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కృతి సనన్.

కెరీర్ ఎర్లీ డేస్‌లోనే ప్రెగ్నెంట్ విమెన్‌గా, ఓ చిన్న బాబు తల్లిగా కనిపించేందుకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు కృతి. అయితే ఆ రిస్కే ఇప్పుడు కృతిని స్టార్ లీగ్‌లో నిలబెట్టింది.

మిమి సినిమాలో చాలెంజింగ్ రోల్‌లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ, రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే అప్పట్లో తాను తీసుకున్న ఆ డెసిషనే ఇప్పటికీ తన కెరీర్‌ను నిలబెడుతుందన్నారు కృతి సనన్.

మిమి సినిమా నటిగా తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందని, ఆ తరువాత కూడా ఎక్స్‌పరిమెంట్ చేసే ఛాన్స్ ఉన్న రోల్సే ఎక్కువగా తన దగ్గరకు వస్తున్నాయన్నారు. కథ నచ్చి, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డీ గ్లామ్ లుక్‌లో కనిపించేందుకు కూడా రెడీ అంటున్నారు ఈ బ్యూటీ.