
కీర్తీ సురేష్ పేరు ఇప్పుడు నెట్టింట్లో యమాగా ట్రెండ్ అవుతోంది. ఆమె పెళ్లి పత్రిక వైరల్ అవుతోంది.

ఓ వైపు పెళ్లి, ఇంకో వైపు బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్టులతో డిసెంబర్ మొత్తం సూపర్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేష్. ఇంతకీ మ్యారేజ్ షాపింగ్ ఎక్కడ చేస్తారంటారా.?

కీర్తీ సురేష్ పెళ్లి ఈ నెల 12న గోవాలో సన్నిహితుల మధ్య వైభవంగా జరగనుంది. 15 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న మిత్రుడు ఆంటోనీతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు సిల్వర్‌స్క్రీన్ మహానటి.

దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు కీర్తి. ఆల్రెడీ మ్యారేజ్ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేశారు ఈ బ్యూటీ.

బేసిగ్గా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో, వెడ్డింగ్‌కి ఓ థీమ్ ప్రకారమే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారట. అదేంటన్నది ఆ రోజు వరకు సస్పెన్స్ అంటున్నారు మల్లు బ్యూటీ.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు మేడమ్ కీర్తి. పెళ్లి తర్వాత కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టే ఆలోచన లేదు. ఆ మాటకొస్తే.. ఇప్పుడు చేస్తున్న బేబీజాన్ సినిమాలో గ్లామర్ విషయంలో కాసింత హద్దులు మీరారన్నది వాస్తవం.

బాలీవుడ్‌లో ది బెస్ట్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలన్నది ఆమె కోరిక. ఇటు పర్సనల్, అటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలన్స్ చేసుకోవాలి కాబట్టి, పెళ్లయ్యాక ఇండస్ట్రీ నుంచి ఎక్కువ లీవులు కావాలని అడగడం లేదు ఈ బ్యూటీ.

మూడు ముళ్లు పడ్డ వెంటనే, బేబీ జాన్ ప్రమోషన్లకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. టైమ్ మేనేజ్‌మెంట్ నాకు కొత్తేం కాదు.. నేను అడ్జస్ట్ చేసుకుంటానని మేకర్స్ కి చెప్పేశారట కీర్తి.