
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనకు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? రోజుల తరబడి మాట్లాడుకున్నా తరగని ఈ టాపిక్‌తో మూవీ చేశారు అనన్య పాండే. ఆల్రెడీ ఈ ఏడాది ఆమెకు కాల్ మీ బే సక్సెస్ క్రెడిట్ ఉంది.

బ్యాడ్ న్యూజ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చేశారు. అయినా అనన్య ఇంకేదో మిస్ అవుతున్నారా.? వరుస ప్రాజెక్టులతో జోరు మీదున్నారు అనన్య పాండే. ఆమె నటించిన 'కంట్రోల్' వచ్చే నెల 4న విడుదల కానుంది.

మీ జీవితం మీ కంట్రోల్‌లో ఉందో లేదో తెలుసుకోండి అంటూ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. మన జీవితాలు డిజిటల్ వరల్డ్ కంట్రోల్‌లో ఉన్నాయా? లేకుంటే మనమే వాటిని కంట్రోల్ చేస్తున్నామా అంటూ ఆసక్తికరంగా సాగింది ట్రైలర్.

ఆ మధ్య విడుదలైన కాల్ మీ బే ప్రాజెక్ట్ అనన్యకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను ఈ మధ్యే చూశాను. చాలా బావుంది అంటూ అనన్య పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతూ పోస్ట్ పెట్టారు ఉపాసన.

అసలు కాల్‌మీ బేలో అంతలా ఏం ఉందో తెలుసుకోవాలని చూసేశారు మన జనాలు. చేతిలో ఎప్పుడూ ఏవో ప్రాజెక్టులున్నా, నిత్యం బిజీగా ఉన్నట్టే అనిపించినా, ఇంకేదో మిస్ అవుతున్నారు అనన్య పాండే.

ఆ ఇంకేదో ఏంటి.? అంటే బిగ్ మూవీస్ అనే ఆన్సర్ వినిపిస్తోంది ఆమె ఫాలోయర్ల నుంచి. సోషల్ మీడియాలో చేసే సందడి సరిపోదు.. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పుడే టాలెంట్‌కి తగ్గ గుర్తింపు వస్తుందన్నది వారి ఒపీనియన్.

లైగర్ సినిమా తర్వాత ఎందుకో తెలుగు మీద ఫోకస్ చేయలేదు అనన్య. ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ వచ్చినా వరుసగా సినిమాలు చేసి నిలదొక్కుకున్నవారు మన దగ్గర చాలా మందే.

శ్రుతిహాసన్‌లాంటివారు కూడా ఇలాంటి ఇబ్బందుల్నే దాటుకుని వచ్చారు. సో అలాంటివారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ అమ్మణి దక్షిణాదికి దూసుకొచ్చేస్తే బావుంటుందన్నది సౌత్ ఆడియన్స్ అభిప్రాయం.