
లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే.

సౌత్ ఎంట్రీ అనన్యకు అనుకున్న రేంజ్‌లో కిక్ ఇవ్వకపోయినా.. ఆడియన్స్ మాత్రం ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గానే ఫాలో అవుతున్నారు.

దీంతో అమ్మడి రిలేషన్‌షిప్ స్టేటస్‌లు ఇక్కడ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. స్టార్ మేకర్ కరణ్ జోహార్ కాంపౌండ్ నుంచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో అనన్య సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

తొలి సినిమా మల్టీ స్టారర్ కావటంతో అనన్యకు ఆశించినంత క్రేజ్ రాలేదు.

తరువాత కూడా పతీ పత్నీ ఔర్ ఓ, అంగ్రేజీ మీడియం, కాలీ పీలీ లాంటి సినిమాలు చేసినా… హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ రాలేదు.

స్టార్ ఇమేజ్ కోసం సౌత్ హీరోను నమ్ముకున్న ఈ నార్త్ బ్యూటీ.. విజయ్ దేవరకొండకు జోడిగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు.