
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అలియా.

స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ ఆమె తొలి సినిమా. తొలి సినిమాతోనే అందంతో నటనతో కట్టిపడేసింది ఈ చిన్నది.

బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది.

అలాగే మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఈ చిన్నది పరిచయమయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది అలియా.

. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత అనే పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక అలియా భట్ ప్రస్తుతం హాలీవుడ్ లో నటిస్తుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది అలియా.