
స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాగానే.. దర్శకులలో ఒక రకమైన ఎగ్జైట్‌మెంట్‌తో పాటు కంగారు కూడా వస్తుంది. వాళ్లను ఎలా చూపించాలి.. ఎలాంటి కథ రాసుకోవాలి.. ఏం చేయాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఈ మధ్య ఈ కంగారుకు కాస్త కామా పెట్టారు మన దర్శకులు. స్టార్ హీరోలతో ఆఫర్ రాగానే.. అంతా ఒకే దారిలో వెళ్తున్నారు. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?

స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినపుడు దర్శకులకు ఉండే ఎగ్జైట్‌మెంట్ మామూలుగా ఉండదు. రిస్క్ తీసుకోకుండా.. సింపుల్‌గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ.. వాళ్ల ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. బాలయ్యతో బాబీ ఇదే చేస్తున్నారు. అఖండ నుంచి బాలయ్యలోని వింటేజ్ ఇమేజ్‌పై ఫోకస్ చేస్తున్నారు డైరెక్టర్స్.

వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లోనూ బాలయ్య వింటేజ్ లుక్‌తో పాటు ఆయన ఇమేజ్ బాగా వర్కవుట్ అయింది. అందుకే బాబీ కూడా ఇదే చేస్తున్నారు. ఇక వెంకటేష్‌తో అనిల్ రావిపూడి ఇదే చేస్తున్నారు. ఈయనలో ఉన్న కామెడీ టైమింగ్ వాడుకుంటున్నారు అనిల్. రవితేజ 75వ సినిమా కోసం పూర్తిగా ఆయనలోని వింటేజ్ ఇమేజ్ బయటికి తెస్తున్నారు కొత్త దర్శకుడు భాను భోగవరపు.

సామజవరగమనా సినిమాకు రైటర్‌గా పని చేసిన భాను.. రవితేజలోని ఎంటర్‌టైనింగ్ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ. మరోవైపు చిరంజీవి ఐతే పూర్తిగా వింటేజ్ లుక్‌తోనే దర్శనమిస్తున్నారు. దర్శకులు కూడా ఆయనలోని మాస్ యాంగిల్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

స్టార్ హీరోలకు ఎలాగూ అదిరిపోయే ఇమేజ్ ఉంటుంది.. దానికితోడు వాళ్ల ఒకప్పటి స్టైల్ మ్యాచ్ చేస్తూ కథలు రాసుకుంటే సరిపోతుందని ఫిక్సైపోతున్నారు దర్శకులు. నిజానికి అది రిస్క్ లేని పని కూడా. వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి, ధమాకా, ఎఫ్2 లాంటి సినిమాలు పాత కథలతో విజయం సాధించడానికి కారణం ఇదే. అందుకే జై వింటేజ్ స్టార్స్ అంటున్నారు డైరెక్టర్స్.