
కుమారి 21ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టి పడేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

ఈడో రకం ఆడో రకం, నిఖిల్ సరసన నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలు ఆడినా వీటిల్లో సెకెండ్ లీడ్‌గా నటించింది హెబ్బా. క్రమంగా సెకెండ్ లీడ్, స్పెషల్ సాంగ్స్‌లో సందడి చేస్తోంది.

ప్రస్తుతం ఓటీటీ సినిమాలు, సిరీసుల్లో నటిస్తోంది ఈ అందాల తార. గతేడాది ఓదెల రైల్వే స్టేషన్‌లో నటించిన హెబ్బా ఈ ఏడాది వ్యవస్థ అనే వెబ్ సిరీస్‌లో కీ రోల్ పోషించింది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది హెబ్బా. తన లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను కూడా అమితంగా ఆకట్టుకుంటుంటాయి.

తాజాగా వైట్‌అండ్ రెడ్ డ్రస్‌లో దిగిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది హెబ్బా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.