
బాలీవుడ్ కపుల్ కాజోల్-అజయ్ దేవ్ గన్ ల కూతురు నైసా దేవగన్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇంకా సినిమాల్లోకే అడుగుపెట్టని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలా ఇప్పుడు నిసాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పార్టీ అయినా లేదా డిన్నర్ డేట్ అయినా సినిమా ఈవెంట్ అయినా.. నిసా దేవగన్ ఫోటోలు,వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి.

కాగా అమ్మానాన్నల్లాగే నిసా దేవ్‌గన్ కూడా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. దీనిపై కాజోల్, అజయ్ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.

అయితే నిసా తాను కోరుకున్న రంగంలో కెరీర్‌ను కొనసాగించేందుకు అనుమతిస్తానని అజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

కూతురు సంగతి పక్కన పెడితే కాజోల్, అజయ్ లు మాత్రం ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నారు.