విశ్వంలోనే అందగత్తె అని పిలిపించుకోవాలని ఏ యువతికి ఉండదు చెప్పండి ఆ కిరీటాన్ని దక్కించుకోవడం అంత సులభంగా ప్రపంచదేశాల్లో ఉన్న అందమైన మగువలను దాటి కిరీటాన్ని గెలుచుకోవడం మాటలు కాదు కానీ ఆఘనతను సాధించింది 21 సంవత్సరాల అమ్మాయి హర్నాజ్ కౌర్ .
70వ మిస్ యూనివర్స్ పోటీల్లో.. 80 మంది అందాల భామలు తలపడ్డారు. తన అందంతో ఒక్కొక్కరినీ దాటుకుంటూ.. జడ్జిల మనసు గెలుచుకుంటూ విశ్వసుందరిగా నిలిచింది పంజాబ్‌లో పుట్టిన హర్నాజ్ కౌర్ సంధు.
ఇక ఇప్పటివరకు ఇండియా తరపున మిస్ యూనివర్స్ కు పోటీ పడ్డ భామలు ఎవరో మీకు తెలుసా.. ఆ అందాల భామలు ఎవరంటే.. సుస్మితా సేన్, లారా దత్తా, సెలీనా జైట్లీ, నేహా దుపియా పోటీపడ్డారు.
1994 సంవత్సరంలో తన 18వ యేట మిస్ యూనివర్స్ పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకుంది.
ఇండియా తరపునఎన్నికైన మరో మిస్ యూనివర్స్ లారాదత్త . 2000 సంవత్సరంలో విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.
సెలీనా జైట్లీ.. ఈ అమ్మడు 2001 లో మిస్ ఇండియా గా నిలిచింది అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నపటికీ.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
నేహా దుపియా.. 2002లో ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ భామ. తరువాత కరేబియన్ దీవుల్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో టాప్ 10లో నిలిచింది.