
2012లో మలయాళ చిత్రం పద్మవ్యూహంలో చిన్న పాత్రతో సినీ రంగంలో అడుగుపెట్టింది. 2018లో తమిళ చిత్రం పడైవీరన్లో హీరోయిన్‌గా తొలి ప్రధాన పాత్ర పోషించి, సైమా అవార్డులకు నామినేట్ అయింది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక తెలుగులో రెడ్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.

రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో ఆమె నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

నటనపరంగానే కాదు అందంతోనూ ఈ భామ కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఇక ఈ బ్యూటీ హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. హనుమాన్ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

చివరిగా బచ్చలమల్లి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలైంది, కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.