Ramcharan: గ్లోబల్ స్టార్ నయా స్ట్రాటజీ… ఫ్యాన్స్ తో ములాఖత్ అందుకేనా
ఒకటే పడవ మీద ప్రయాణం చేసే రోజులు లేవిప్పుడు. ఏ పని చేసినా.. పుణ్యం పురుషార్థం రెండూ దక్కాల్సిందే. ఈ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. ఆయన ఏం చేసినా పర్సనల్‌గానూ, ప్రొఫెషనల్‌గానూ కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మేకర్స్ అడిగిన కాల్షీట్లు పంచేసి, సినిమాలు చేయడం ఎంత సేపూ... ఎవరైనా చేస్తారు. ప్రాజెక్ట్ విషయంలో అంతకు మించి ఏం చేశామన్నదే కదా..ఎప్పుడైనా కౌంట్‌లోకి వచ్చేది.