బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు జానికి అలియాస్ ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది ప్రియాంక. ఈ సీరియల్లో మాటలు రాని అమ్మాయిగా హావభావాలతో ప్రేక్షకుల హృదయాలను దొచేసింది.
ఇక ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్లో జానకి పాత్రలో నటించింది. మంచి రెస్పాన్స్ అందుకుంటూ వచ్చిన ఈ సీరియల్ ఇటీవలే ఎండ్ కార్డ్ పడింది. ఇక ఇప్పుడు ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు సీరియల్ హీరోయిన్ గా అలరించిన ప్రియాంక.. ఇప్పుడు బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే ఆదివారం సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రియాంక జైన్.. కన్నడలో ఓ సినిమాలో నటించింది. అలాగే తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది. సినిమాల కంటే సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది ప్రియాంక
ఇదిలా ఉంటే.. తన మొదటి తెలుగు సీరియల్ మౌనరాగం ఫేమ్ శివకుమార్ తో ప్రేమలో ఉంది ప్రియాంక. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. తెలుగు, పింక్ లంగావోణిలో ఎంతో అందంగా .. చూడముచ్చటగా కనిపిస్తుంది ప్రియంకా.
బిగ్‌బాస్‌లోకి జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక.. లంగావోణి కట్టిన వయ్యారాల సిన్నది.. బ్యూటీఫుల్ ఫోటోస్..