Rajeev Rayala |
Dec 09, 2021 | 9:07 PM
హా..హా..హాసినీ’, ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది జెనీలియా.
తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు 2012లో బాలీవుడ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.
దీంతో సిల్వర్ స్ర్కీన్‌కు దూరంగా ఉండిపోయింది. 2012లో తెలుగులో విడుదలైన ‘నా ఇష్టం’ ఆమె చివరి చిత్రం.
ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించినా పూర్తి స్థాయి క్యారెక్టర్లు చేయలేదు. ఈ నేపథ్యంలో సుమారు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమైందీ ముద్దుగుమ్మ.
‘వేద్’ సినిమాతో సిల్వర్ స్ర్కీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది జెనీలియా.
‘మీ అందరి దీవెనలతో వివిధ భాషల్లో నటించాను. మీ ప్రేమ, గౌరవాన్ని పొందాను. మహారాష్ర్టలో పుట్టి పెరిగిన నేను.. ఇప్పటి వరకు మరాఠీ చిత్రాల్లో నటించలేకపోయాను. అయితే ‘వేద్’తో ఆ లోటు కూడా తీరిపోనుంది
పదేళ్ల విరామం తరువాత నేను సినిమాల్లో నటిస్తున్నాను. నా భర్త, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రంతో మొదటిసారి మెగాఫోన్ పట్టుకోనున్నారు.
నా ఈ ప్రయాణంలో మీ అందరి దీవెనలు తోడుండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొంది జెన్నీ.