
రామ్ చరణ్ హీరోగా, కియారా నాయికగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్‌ని మైసూర్‌లో తెరకెక్కించనున్నారు. ఈ నెలాఖరు నుంచి మైసూర్‌లో షూటింగ్ ఉంటుందట. వచ్చే ఏడాది విడుదల కానుంది గేమ్ చేంజర్.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో రాయలసీమ యాసలో మాట్లాడనున్నారు రవితేజ.

పుష్ప సీక్వెల్ కోసం అల్లు అర్జున్ చూపిస్తున్న డెడికేషన్ ఇంకో లెవల్లో ఉందంటున్నారు యూనిట్ సభ్యులు. ఇటీవల తెరకెక్కించిన జాతర సీక్వెన్స్ లో బన్నీ నటన చూసిన వారికి గూస్‌బంప్స్ వస్తాయని అంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది పుష్ప2.

యంగ్ హీరో అధర్వతో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు ఖుషీ కపూర్. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇటీవల ఖుషీ కపూర్ సంతకం చేసినట్టు సమాచారం. అక్క జాన్వీ కపూర్ తెలుగులో దేవరతో ఎంట్రీ ఇస్తుంటే, ఖుషి లైకా చిత్రంతో కోలీవుడ్‌లో పరిచయమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తీరు చూస్తే ముచ్చటేస్తోందని అన్నారు నటి కత్రినా కైఫ్. భార్యాభర్తలు ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని, విరాట్, అనుష్కను చూసిన ప్రతిసారీ పర్ఫెక్ట్ కపుల్‌గా అనిపిస్తారని అన్నారు కత్రినా.