రోహిత్ నంద, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాధన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా విధి. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో ఘనంగా జరిగింది. దీనికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారాయన.
'రామన్న యూత్' సినిమాతో హీరోగా పరిచయమైన అభయ్ నవీన్ తాజాగా మరో సినిమాలో నటిస్తున్నారు. దాని పేరు 'రాక్షస కావ్యం'. ఇందులో అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 13న థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమాను శింగనమల కళ్యాణ్ నిర్మించారు. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో చదలవాడ లక్ష హీరోగా నటిస్తున్న సినిమా 'ధీర'. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఈ సినిమా వస్తుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌ను తాజాగా హీరో లక్ష పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. పక్కా మాస్ సినిమాగా ధీర వస్తుంది.
సందీప్‌కుమార్, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి తెరకెక్కిస్తున్న సినిమా 'ద్రోహి'. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియన్స్‌కు ఓ ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది.
సిద్ శ్రీరామ్ పాడితే కచ్చితంగా ఆ పాట హిట్ అనే సెంటిమెంట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆయన పాటలు ఆయువుగా మారుతున్నాయి. మణి సాయి తేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర తెరకెక్కిస్తున్న సినిమా ‘మెకానిక్’ – ట్రబుల్ షూటర్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలోని ఓ పాట ఇప్పుడు యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది. నచ్చేసావే పిల్లా నచ్చేసావే అంటూ సాగిన ఈ పాటకు 70 లక్షల వ్యూస్ వచ్చాయి.