Movie News: కోపం తెచ్చుకున్న సాయి పల్లవి.. కుమారి శ్రీమతిగా నిత్యా మీనన్..

| Edited By: Prudvi Battula

Sep 24, 2023 | 2:51 PM

ఎప్పుడూ కూల్‌గా ఉండే సాయి పల్లవికి కోపం తెప్పించారు కొందరు. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్ ట్రైలర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. స్కంద సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలోని ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్.

1 / 5
సాయి పల్లవి కోపం..  ఎప్పుడూ కూల్‌గా ఉండే సాయి పల్లవికి కోపం తెప్పించారు కొందరు. కొన్ని రోజులుగా ఓ దర్శకుడితో పెళ్లి ఫోటోలంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. వీటిపై స్పందిస్తూ.. తన సినిమా పూజా కార్యక్రమంలో ఉన్న ఫోటోలను కావాలనే క్రాప్ చేసి విడుదల చేసారంటూ చెప్పుకొచ్చారు. తను రూమర్స్ పట్టించుకోనని.. కానీ కుటుంబం విషయానికి వస్తే స్పందిస్తానని చెప్పారు సాయి పల్లవి. 

2 / 5
చిరంజీవి @ 45 ఇయర్స్ జర్నీ..  మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ళ సినీ జర్నీని పూర్తి చేసుకున్నారు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదుతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు చిరు. ముందు పునాది రాళ్లు సినిమా మొదలైనా.. విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదే. ఈయన నాలుగున్నర దశాబ్ధాల ప్రస్థానంపై రామ్ చరణ్ ట్వీట్ చేశారు. తండ్రికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.

3 / 5
కుమారి శ్రీమతి..  నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్ ట్రైలర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే, కుమారి శ్రీమతి తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయిగా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు.

4 / 5
స్కంద ప్రమోషన్స్ షురూ..  బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో వస్తున్న స్కంద సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా రామ్, శ్రీలీల ఇంటర్వ్యూలు మొదలు పెట్టారు. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న స్కందపై అంచనాలు బాగానే ఉన్నాయి. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి.

5 / 5
ఆకాశం దాటి వస్తావా..?  కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఆసక్తి పెరిగిపోయింది. బలగం తర్వాత ఆ సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. మ్యూజికల్ లవ్ స్టోరీగా వస్తుంది ఆకాశం దాటి వస్తావా సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. తాజాగా ఈ సినిమాలోని ఉన్నానో లేనో అనే లిరికల్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్.