జైలర్ సినిమాతో రేర్ రికార్డ్ సెట్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. 50 ఏళ్లుగా స్టార్ హీరోగా కొనసాగటమే కాదు. ప్రతీ ఏడాది ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్‌గా అవతరించారు తలైవా. అందుకే జైలర్ సక్సెస్‌ను నెక్ట్స్ లెవల్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
దాదాపు పదేళ్లుగా సరైన హిట్ లేని రజనీకాంత్, జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. తలైవా మేనియా ఇది, అనే రేంజ్ హిట్ పడటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. గత యాబై ఏళ్లలో ప్రతీ దశాబ్దంలోనూ ఓ ఇండస్ట్రీ హిట్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు రజనీకాంత్.
80లలో బిల్లాగా బాక్సాఫీస్‌ను షేక్ చేశారు తలైవా. అప్పట్లో రజనీ స్టైల్, స్వాగ్‌కు సౌత్ ఇండస్ట్రీ ఫిదా అయ్యింది. ఆ తరువాత 90స్‌లో పడయప్ప సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఈ సినిమా నరసింహా పేరుతో తెలుగులోకి డబ్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.
2000 దశకంలో ఎంథిరన్ (రోబో)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ అప్పట్లోనే పాన్ ఇండియా ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశారు. సౌత్ సినిమా అప్పటి వరకు ఊహించని మార్కెట్ నెంబర్స్‌ను టచ్ చేసి చరిత్ర సృష్టించారు. నెక్ట్స్ డెకేడ్‌లో 2.ఓతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రజనీ కంటెంట్ పరంగా నిరాశపరిచినా... కలెక్షన్స్ పరంగా మాత్రం మరోసారి చరిత్ర సృష్టించారు.
తాజాగా జైలర్ సినిమాతో పాత రికార్డులన్ని చెరిపేశారు రజనీకాంత్. మూడు వారాల్లో 600 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన జైలర్, ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఫుల్ రన్‌లో ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇలా 50 ఏళ్లుగా ప్రతీ దశాబ్దంలోనూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశారు తలైవా.