
ఆర్నెళ్ళ ముందే 2025 సమ్మర్ సీజన్ కళకళలాడుతుంది. ఈ సారి స్టార్ హీరోలు కూడా రేసులోనే ఉన్నారు. ఓ వైపు చిరంజీవి.. మరోవైపు ప్రభాస్.. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ అంతా సమ్మర్ బరిలోనే ఉన్నారు. ఈ రేస్ హరిహర వీరమల్లుతో మొదలు పెట్టనున్నారు పవన్. మార్చ్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. అదే రోజు VD12 కూడా ప్రకటించారు.

పవన్ ఇప్పుడున్న బిజీకి వీరమల్లు వస్తుందా లేదా అనే అనుమానాలైతే ఉన్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు ఆ డేట్‌కు రాకపోతే.. ఓజిని రేసులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సుజీత్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ రొమాంటిక్ కామెడీ స్పీత్రం రాజా సాబ్ ఎప్రిల్ 10న విడుదల కానుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్. రిద్ధి కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న యాక్షన్అ డ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మిరాయ్ ఏప్రిల్ 18న రానుంది. 2025 మే 1న నాని పోలీస్ పాత్రలో నటిస్తున్న మాస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 విడుదల కానుంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్. షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది.

టాలీవుడ్‌కు జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి లాంటి సినిమాలు అందించిన లక్కీ డేట్ మే 9న రవితేజ మాస్ జాతర రానుంది. ఆ రోజే చిరంజీవి విశ్వంభర విడుదలవుతుందని తెలుస్తుంది. మొత్తానికి ఎటు చూసుకున్నా.. సమ్మర్ 2025కి పూనకాలు ఖాయం.