ఆ విషయం లో.. టాలీవుడ్ టాప్‌ స్టార్స్ మధ్య టఫ్‌ ఫైట్‌..

Edited By: Phani CH

Updated on: Apr 19, 2025 | 6:28 PM

ప్రజెంట్ మన స్టార్ హీరోల మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ నడుస్తుంది. ఇన్నాళ్లు సక్సెస్‌, కలెక్షన్ల విషయంలోనే హీరోలు పోటి పడేవారు. కానీ ఇప్పుడు వాళ్ల సినిమాల బడ్జెట్‌ విషయంలో కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. దీంతో అప్‌ కమింగ్ సినిమాల బడ్జెట్‌ నెంబర్స్ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇస్తున్నాయి. ఏ ఏ సినిమాలే ఎంతెంత బడ్జెట్‌తో రూపొందుతున్నాయి... ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ వెయ్యి కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేస్తుండటంతో బడ్జెట్‌ విషయంలోనూ అదే రేంజ్‌లో ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ముఖ్యంగా పుష్ప 2, కల్కి 2898 ఏడీ సినిమాల సక్సెస్‌ తరువాత నిర్మాతల్లోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే ప్రజెంట్‌ సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమాల కోసం వందల కోట్లు గుమ్మరిస్తున్నారు నిర్మాతలు.

2 / 5
మహేష్, రాజమౌళి మూవీ బడ్జెట్‌ వెయ్యి కోట్ల పైనే అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్‌గా ప్రభాస్‌ ఫౌజీ సినిమా బడ్జెట్‌ ఎంతో రివీల్ చేశారు బాలీవుడ్‌ నటుడు మిథున్ చక్రవర్తి, దాదాపు 700 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత చేయబోయే స్పిరిట్ కోసం అంతకు మించి బడ్జెట్‌ రెడీ చేసుకుంటున్నారు సందీప్‌ రెడ్డి వంగా.

3 / 5
దేవర సినిమా కోసమే 300 కోట్లు ఖర్చు పెట్టింది ఆ మూవీ టీమ్‌. తారక్‌ నెక్ట్స్ మూవీకి బడ్జెట్‌ డబుల్ కానుంది. ప్రశాంత్‌ నీల్ - తారక్‌ కాంబో మీద ఉన్న హైప్‌, ఎన్టీఆర్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని డ్రాగన్‌ సినిమా కోసం 600 కోట్ల వరకు బడ్జెట్‌ పెట్టేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్.

4 / 5
ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చే రేంజ్‌లో బడ్జెట్ లెక్కలు చూపిస్తున్న మూవీ ఏఏ 22. అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మోస్ట్ అవెయిటెడ్‌.

5 / 5
అందుకే ఈ సినిమా మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అంటోంది ప్రోడక్షన్ టీమ్‌. కాస్త అటు ఇటుగా ఈ సినిమా బడ్జెట్‌ కూడా వెయ్యి కోట్ల దగ్గర్లో ఉంటుందని సమాచారం. ఇలా ఒక్కో సినిమా బడ్జెట్‌ లెక్కలు ఆడియన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాయి.