
28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్‌లో థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో నవీన్ పోలిశెట్టి సరసన తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతిరత్నాలులో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది.

జాతిరత్నాలు సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA) అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో అతిధి పాత్రలో కనిపించింది.

ఆమె 2022లో లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

గత ఏడాది అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో నటించింది. దీంతో పాటు కామెడీ థిల్లర్ మత్తు వదలరా 2 సినిమా ఇన్‌స్పెక్టర్ నిధి పాత్రలో ఆకట్టుకుంది. అలాగే ప్రభాస్ కల్కి సినిమా స్పెషల్ సాంగ్‌తో మెప్పించింది.