
బాలీవుడ్ క్లాసిక్స్‌తో డాన్ సినిమా పేరు ఎప్పుడూ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమాను తరువాత షారూఖ్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. తాజాగా షారూఖ్ డాన్‌కు సంబంచిన ఓ సీక్రెట్‌ను రివీల్ చేశారు మేకర్స్.

అమితాబ్ బచ్చన్ తరువాత అదే రేంజ్‌లో డాన్ పాత్రలో మెప్పించారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అందుకే ఆ సినిమా ఘన విజయం సాధించింది. తరువాత డాన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన డాన్ 2లోనూ షారూఖ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పార్ట్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీక్వెల్‌లో హృతిక్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్.

హృతిక్ కూడా డాన్ రోల్‌లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారు. కానీ కథ రెడీ చేసే సమయంలో క్యారెక్టర్ యాటిట్యూడ్ షారూఖ్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్ అనిపించటంతో హృతిక్‌కు చెప్పి డాన్ రోల్ కోసం షారూఖ్‌ను సంప్రదించారు.

అమితాబ్ చేసిన ఐకానిక్ పాత్రను రీ క్రియేట్ చేసేందుకు ముందు కాస్త ఆలోచించినా... తరువాత డాన్ రోల్‌లో నటించేందుకు ఓకే చెప్పారు షారూక్. డాన్, డాన్ 2లో షారూఖ్ లీడ్ రోల్‌లో నటించగా ఇప్పుడు డాన్ 3లో రణవీర్ సింగ్ డాన్ పాత్రలో నటిస్తున్నారు.