ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ కమెడియన్

|

Oct 04, 2024 | 8:08 PM

ప్రస్తుతం భారతదేశపు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు జక్కన్న. ‘బాహుబలి’ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ‘RRR’ సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డుల్లో కూడా మెరిపించేలా చేశాడు.

ప్రస్తుతం భారతదేశపు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు జక్కన్న. ‘బాహుబలి’ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ‘RRR’ సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డుల్లో కూడా మెరిపించేలా చేశాడు. అలాంటి రాజమౌళిని ఇప్పుడు ఓ కామెడీ షోలో వెక్కిరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే. బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఒక దశాబ్దం నుంచి టీవీలో ‘కపిల్ శర్మ షో’ని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీ షో కాస్తా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి మారిపోయింది. ది కపిల్ షో కొత్త సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో ‘దేవర’ బృందం నుండి జూ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ అతిథులుగా హాజయ్యారు. ఈ సమయంలో రాజమౌళిని కొందరు అవమానించేలా షో జరిగిందటూ కొందరు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఎన్టీఆర్ ముందే ఇలా చేయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో అపశృతి.. హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం

బాలయ్య సూపర్ హిట్ సినిమానే.. విజయ్‌ చివరి చిత్రంగా రీమేక్ చేస్తున్నారా ??

Mathu Vadalara 2: డేట్‌ కన్ఫర్మ్‌ !! OTTలోకి వచ్చుడే ఆలస్యం

హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్‌.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్‌

మీ ఎజెండా, మైలేజ్‌ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??