
అంతకు ముందు ఎన్ని సినిమాలు చేస్తేనేం.. ఎంత స్ట్రగుల్ పడితేనేం.. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్.. జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చిపెడుతుంది అనడానికి విక్రాంత్ మాస్సే లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు విక్రాంత్.

లాస్ట్ ఇయర్ వచ్చిన ట్వెల్త్ ఫెయిల్‌కి జస్ట్ క్రిటిక్స్ నుంచే కాదు.. ఆడియన్స్ నుంచి కూడా ది బెస్ట్ అప్లాజ్ అందుకున్నారు విక్రాంత్. ఆ వెంటనే ఈ ఏడాది ఆయన ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు కనిపించాయి. గతంలో వచ్చిన హసీనా దిల్‌రుబా సీక్వెల్ ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా కూడా ఉంది అందులో.

దేశమంతా మాట్లాడుకుంటున్న ది సబర్మతి రిపోర్ట్ కూడా విక్రాంత్ ఖాతాలోనే పడింది. సినిమా రిలీజ్‌కి ముందు భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించలేకపోయింది ఈ మూవీ. సినీ కెరీర్‌లో ఫెయిల్యూర్‌లు, గుర్తింపు లేకపోవడాలూ విక్రాంత్‌కి కొత్త కాదు.

అయినా, ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన ఈ టైమ్‌లో.. సినిమాలకు దూరమవుతున్నా. ఇప్పుడు సెట్స్ మీదున్న మూవీస్ కంప్లీట్ చేశాక, ఫ్యామిలీకి సమయం కేటాయించాలనుకుంటున్నా. మళ్లీ నేను అనౌన్స్ చేసేవరకు సినిమాలకు దూరంగానే ఉంటానని ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

విక్రాంత్ ఈ స్టేట్‌మెంట్‌ని.. ఏదైనా సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇచ్చారా? లేకుంటే ఎవరైనా ఆయన మీద ఒత్తిడి పెంచారా? అంటూ రకరకాల కామెంట్స్ పాస్ అవుతున్నాయి. ఇదంతా నిజం కాకపోతే బావుంటుందని కోరుకుంటున్నారు విక్రాంత్ కొలీగ్స్ అండ్ ఫ్యాన్స్.