ఆ కథల సీక్వెల్స్‌ కావాలంటూ రిక్వెస్ట్‌ చేస్తున్న ఫ్యాన్స్.. ఉంటాయా.. లేదా ?

Edited By: Phani CH

Updated on: May 19, 2025 | 5:15 PM

కొన్ని కథలు ఆడియన్స్‌ను ఎంతగా ఆకట్టుకుంటాయంటే.. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది అన్న విషయాన్ని ప్రేక్షకులు అంగీకరించలేరు. అందుకే మేకర్స్‌కు సీక్వెల్స్‌ కావాలన్న రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. అలా సినీ అభిమానులను ఊరిస్తున్న పాన్ ఇండియా సీక్వెల్స్‌ చాలానే కనిపిస్తున్నాయి. అసలు ఉంటాయో లేదో తెలియకపోయినా... ఆ సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

1 / 5

రీసెంట్‌గా రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ట్రిపులార్ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జక్కన్న సీక్వెల్‌ గురించి ప్రస్తావించారు. ట్రిపులార్ 2 ఉంటుందా? అన్న ప్రశ్నకు తప్పుకుండా! అంటూ అంచనాలు పెంచేశారు.

2 / 5
దీంతో చరణ్, తారక్‌ కాంబోనూ మరోసారి తెర మీద చూసేందుకు అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు డిమాండ్ చేస్తున్న మరో క్రేజీ సీక్వెల్‌ కేజీఎఫ్‌.

3 / 5
ఇప్పటికే ఈ సీరిస్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 3 కావాలంటూ ఫ్యాన్స్‌ కోరుతున్నారు. దర్శక నిర్మాతలు కూడా మూడో భాగం ఉంటుందని చెబుతున్నా... అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో క్లారిటీ లేదు.

4 / 5
జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్‌ తరువాత కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. 35 ఏళ్ల తరువాత ఇప్పుడు సీక్వెల్‌ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఫాంటసీ కథలను మరింత గ్రాండ్‌గా చెప్పే అవకాశం ఉండటంతో సీక్వెల్‌కు ఇది పర్ఫెక్ట్‌ టైమ్ అని సజెస్ట్ చేస్తున్నారు.

5 / 5
మెగా మూవీ విషయంలో కాస్ట్ అండ్‌ క్రూ సజెన్స్‌ కూడా ఫ్యాన్స్‌ సైడ్‌ నుంచే వినిపించాయి. రామ్‌ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందంటున్నారు అభిమానులు. రీసెంట్‌గా రీ రిలీజ్‌ ప్రమోషన్‌లో చిరు కూడా అదే మాట చెప్పటంతో సీక్వెల్‌ మీద ఆశలు మరింతగా పెరిగాయి. మరి ఇంతగా అభిమానులను ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అఫీషియల్‌ అప్‌డేట్స్ ఎప్పుడొస్తాయో చూడాలి.