
ఫ్యాన్స్ తమ అభిమాన నటులను స్టార్ ట్యాగ్‌లతో పిలుచుకోవటం అన్నది సౌత్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఈ స్టార్ ట్యాగ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. కానీ ప్రజెంట్ కొంత మంది టాప్ స్టార్స్ తమను స్టార్ ట్యాగ్‌లతో పిలవొద్దంటున్నారు. ఇప్పటికే తమ పేరు ముందు చేరిన టైటిల్స్‌ను ఇక మీదట కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు.

తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదట అభిమానులను తనను కమల్ హాసన్, కే హెచ్ అని మాత్రమే పిలవాలని ఎలాంటి స్టార్ ట్యాగ్‌లు యాడ్ చేయవద్దని కోరుతూ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన కమల్‌ను యూనివర్సల్ స్టార్, లోకనాయకుడు, ఉలగనాయగన్... ఇలా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ ట్యాగ్‌తో పిలుచుకుంటారు అభిమానులు. కానీ ఇప్పుడు అవేవి వద్దు, కేవలం పేరుతోనే పిలవాలని స్యయంగా కమలే కోరటం అభిమానులు ఆలోచనలో పడ్డారు.

గతంలో అజిత్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. అభిమానుల తను పేరు ముందు ప్రేమతో చేర్చిన తల అనే పదాన్ని ఇక మీద కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. అయితే అజిత్ వద్దని చెప్పినా... అభిమానులు మాత్రం ఇప్పటికీ ఏకేని తల అనే పిలుస్తున్నారు.

మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా స్టార్ ట్యాగ్‌లకు దూరంగానే ఉంటున్నారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో సూర్యని కోలీవుడ్ సూపర్ స్టార్ అని పిలిస్తే.. తాను సూపర్ స్టార్‌ని కాదని.. తమిళనాట ఒక్కరే సూపర్ స్టార్ అది రజనీకాంతే అన్నారు. సూర్యని అభిమానులు నడిప్పిన్ నాయగన్ అని పిలుచుకుంటున్నా.. సూర్య మాత్రం ఆ ట్యాగ్‌ను ఎప్పుడు తన మూవీ టైటిల్స్‌లో వాడుకోలేదు.