
ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీలో ఈ చిన్నదాని పేరు మారు మ్రోగిపోయింది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తన నవ్వుతోనే బోలెడంతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ పూజాహెగ్డే. తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది ఈ చిన్నది.

తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది పూజాహెగ్డే. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది ఈముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి ఇప్పుడు బ్యాడ్ లక్ రన్ అవుతుంది.

ఈ మధ్య తెలుగులో పూజాహెగ్డే నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలోనూ పూజా నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంది పూజా.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది పూజాహెగ్డే. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు .