
సోషల్ మీడియాలో ఇప్పుడు టాలీవుడ్ హీరోకు సంబందించిన ఫోటో వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న బుడతడిని గుర్తుపట్టారా.? అమ్మాయిలా డ్రీమ్ బాయ్ అతను.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు ఈ కుర్రాడు. ఇంతకు అతను ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఫిబ్రవరి 24, 1984లో జన్మించిన నాని. అసలు పేరు కందా నవీన్ బాబు. ఒకప్పుడు రేడియో జాకీగా అలరించిన నాని.. తన కఠోర శ్రమ, అంకితభావంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు.

నటుడు కాకముందు కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు నాని. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నాని సినిమాల్లోకి రావడానికి ప్రేరేపించాడు. ఆల్ రౌండర్ నాని అనేక చిత్రాలలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాడు.

నటుడు నాని 2008లో వచ్చిన అష్టా చమ్మా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. నాని పేరు తెచ్చుకున్న సినిమా ఈగ. ఈగ సినిమానే నానికి భారీ హిట్ ఇచ్చింది. సినిమాలో నాని ఎక్కువ సీన్స్‌లో నటించకపోయినప్పటికీ ఉన్నంత సేపు తన నటనతో ఆకట్టుకున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ తర్వాత జెంటిల్‌మన్, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయ్, గ్యాంగ్ లీడర్ వంటి నాని సినిమాలతో నానివరుస హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత ఒక్కో సినిమాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ.. జెర్సీ,దసరా, హాయ్ నాన్న, రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాలతో హిట్స్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని