
అచ్చ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా, ప్రతీ వారం ఇంట్రస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. థియేట్రికల్ రన్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఆహా వేదికగా డిజిటల్ ఆడియన్స్‌కు కూడా మరింత చేరువవుతున్నాయి. ప్రజెంట్ అలా ఆహాలో ట్రెండ్ అవుతున్న సినిమా నెంబర్ గట్టిగా కనిపిస్తోంది.

షార్ట్ బ్రేక్ తరువాత నివేద థామస్ కీలక పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. మధ్య తరగతి కుటుంబాలు, వాళ్ల ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

అక్టోబర్ 2న డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాదిస్తోంది. కొద్ది రోజుల్లోనే వంద మిలియన్ మినిట్స్ వ్యూస్‌తో ఆహాలో మోస్ట్ వ్యూడ్ మూవీగా నిలిచింది 35 చిన్న కథ కాదు.

35 చిన్న కథ కాదు స్ట్రీమ్ అయిన రెండు రోజుల్లోనే బాలుగాడి టాకీస్ అనే మరో ఇంట్రస్టింగ్ మూవీని రిలీజ్ చేసింది ఆహా. ఈ సినిమాకు కూడా డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగానూ బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేస్తోంది ఈ మూవీ.

సుహాస్ హీరోగా తెరకెక్కిన గొర్రె పురాణం సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 10న స్ట్రీమ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసిన ఆహా టీమ్... మరిన్ని ఇంట్రస్టింగ్ మూవీస్‌కు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయని తెలిపింది.