ఇక ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, సాయిధరమ్ తేజ్, రామ్ చరణ్ ఇలా ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ నటనతో టాలీవుడ్‌నే షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్ని సినిమాలు వచ్చినా, చిరంజీవి ఆ రోజుల్లో చేసిన సినిమాలంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది.
అయితే చిరంజీవిని అమితంగా ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా చిరంజీవి చేసిన సినిమాల్లో ఒక సినిమా అంటే చాలా ఇష్టం అంట. అంతే కాదండోయ్ ఆ సినిమాను పవన్ కళ్యాణ్, రీమేక్ కూడా చేద్దాం అనుకున్నాడంట. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే?
చాలా మందికి చిరంజీవి సినిమాల్లో ఇష్టమైన సినిమా అంటే జగదీక వీరుడు అతిలోక సుందరి మూవీ పేరే ఎక్కువ వినిపిస్తుంటుంది. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం చిరంజీవి నటించి ఖైదీ సినిమా అంటే చాలా ఇష్టం అంట.
ఈ మూవీకి రీమేక్ కానీ, సీక్వెల్ కానీ చేయాలని పవన్ కళ్యాణ్ జానీ సినిమా చేసిన తర్వాత చాలా ప్లాన్ చేశాడంట. అంతే కాకుండా దర్శకుడిని పిలిచి మరి నాకు అన్నయ్య ఖైదీ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని తెలిపారంట.
కానీ తర్వాత ఏవో కారణాలతో ఆ సినిమా తీయాలని అనుకోవడం తర్వాత మరో ముందడుగు పడలేదంట. అలా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఖైదీ సినిమా సీక్వెల్ మిస్స్ అయ్యిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగవైరల్ అవుతోంది.