సెలబ్రెటీస్ ఫిట్ నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు లక్షలు ఖర్చులు చేస్తుంటారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాగే ప్రతి రోజు జిమ్ లో వ్యాయమం చేస్తుంటారు. ఎప్పుడు ఫిట్ గా కనిపిచేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వారి ఫిట్ నెస్ ట్రైనర్ జీతం ఎంత ఉంటుందో తెలుసా. ఈ విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
క్యూట్ బ్యూటీ అలియా కూడా యాక్షన్ ఇమేజ్‌కు రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో అలాంటి రోల్స్ చేసినా ఈ మధ్య కాలంలో అలియా యాక్షన్ సీన్స్‌లో కనిపించలేదు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్‌లో చాలా కాలం తరువాత యాక్షన్ సీన్స్‌లో నటించారు అలియా భట్.
కంగనా రనౌత్..వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు కంగానా. అలాగే ఫిట్ నెస్, ఆరోగ్యం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కంగనాకు యోగేష్ భటిజా ఫిట్ నెస్ ట్రైనర్. అతనికి ప్రతి నెల రూ.45 వేలు జీతం.
దీపికా పదుకొనే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలో నటిస్తుంది దీపికా. ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది దీపికా. యోగా, జిమ్ చేస్తుంటారు. దీపికకు యాస్మిన్ కరాచీవాలా ఫిట్ నెస్ ట్రైనర్. తన జీతం రూ.45 వేలు.
మలైకా అరోరా.. 49 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది మలైకా. ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ నమ్రత పురోహిత్. తన జీతం రూ.73 వేలు.
కత్రినా కైఫ్.. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపిస్తుంది. మొదటి నుంచి ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వస్తుంది. అలాగే జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆమె యాస్మిన్ కరాచీవాలా వద్ద శిక్షణ తీసుకుంటుంది. ఇందుకోసం తనకు రూ. 45 వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.