
కీర్తిసురేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మహానటి. లెజెండ్రీ హీరోయిన్ మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహానటి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది కీర్తిసురేష్. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.

అచ్చం సావిత్రిలానే కనిపించిన కీర్తిసురేష్. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది కీర్తిసురేష్. సినిమా చూసిన వారందరూ నిజంగా సావిత్రినే చూసినట్టుందని ఆమెను ప్రశంసించారు.

మహానటి సినిమా కీర్తిసురేష్ కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కీర్తికి తెలుగులో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఎన్నో క్రేజీ ఆఫర్స్ అందుకుంది కీర్తిసురేష్. అయితే ఈ సినిమాలో కీర్తికంటే ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట.

మహానటి సినిమాలో కీర్తిసురేష్ కంటే ముందు నిత్యామీనన్ ను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆమె ప్లేస్ లోకి కీర్తిసురేష్ వచ్చింది. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించింది నిత్యామీనన్.