
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు తెలుగులోనూ నటించింది ఈ చిన్నది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కత్రినా కైఫ్.

మల్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ చిన్నది నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో కత్రినా కైఫ్ బాలీవుడ్ కు చెక్కేసింది.

బాలీవుడ్ లో వరుసగా సినిమాలతో బిజీ మారిపోయింది. స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించి ప్రేక్షకులను అలరిస్తుంది కత్రినా.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది.

పెళ్లి తర్వాత కత్రినా కైఫ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవలే మేరీ క్రిస్ మాస్ అనే సినిమాలో నటించింది దీనిలో విజయ్ సేతుపతి హీరోగా నటించింది. ఇదిలా ఉంటే తెలుగులో మల్లీశ్వరి సినిమాకోసం కత్రినా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.?

మొత్తానికి మల్లీశ్వరి సినిమాకు కత్రినా కైఫ్ ఏకంగా కోటిరూపాయిలు అందుకుందని తెలుస్తోంది. కత్రినా రెమ్యునరేషన్ డెబ్బై లక్షలు అని అలాగే ఆమె స్టాఫ్, రాకపోకలకు మరో 25 లక్షలు ఖర్చు చేశారట. మొత్తంగా కోటి రెమ్యునరేషన్ ఇచ్చారట.