
టాప్ హీరోయిన్స్ గా దూసుకుపోతోన్న బ్యూటీస్ లో పూజాహెగ్డే ఒకరు. టాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

వరుసగా టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది పూజాహెగ్డే. అలాగే రెమ్యునరేషన్ లోనూ అత్యధికంగా అందుకునే భామల లిస్ట్ లో పూజాహెగ్డే ఒకరు.

ప్రస్తుతం పూజ హెగ్డే సినిమా ఛాన్స్ లు తగ్గాయి. ఈ మధ్య కాలంలో పూజాహెగ్డే నటించిన సినిమాలనే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

ఇక్క పూజా హెగ్డే దగ్గర కాస్ట్లీ కార్లు ఉన్నాయి. రెండు కోట్లకు పైగా విలువైన పోర్షే కారు, కోటి విలువైన లగ్జరీ జాగ్వార్ కారు, ఆడి క్యూ7 కారు కూడా ఉంది. దీని ధర దాదాపు 80 లక్షలు.

పూజా హెగ్డే వద్ద బిఎమ్‌డబ్ల్యూ 350డి కారు, ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. దీని ధర దాదాపు 22 లక్షలు. పూజా హెగ్డేకి హైదరాబాద్‌లో ఒకటి, ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.