Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.. ? ఆ టాలీవుడ్ హీరో మూవీలో..

Updated on: Mar 09, 2025 | 9:23 AM

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.. ? ఆ టాలీవుడ్ హీరో మూవీలో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐశ్వర్య రాజేశ్. ఇన్నాళ్లు తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే చిన్నప్పుడే ఐశ్వర్య ఓ తెలుగు సినిమాలో కనిపించిందన్న సంగతి తెలుసా.. ?

1 / 5
ఐశ్వర్య రాజేశ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

2 / 5
అయితే తమిళంలో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ఐశ్వర్య రాజేశ్.

3 / 5
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేశ్. ఇందులో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ మనసులు గెలుచుకుంది.

4 / 5
అయితే ఐశ్వర్య రాజేశ్ చిన్నప్పుడే తెలుగులో ఓ సినిమా చేసిందని తెలుసా.. ?  నటకిరిటీ రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. తెలుగమ్మాయే అయినా తమిళ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది.

5 / 5
ఆ తర్వాత కొన్నాళ్లకు కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో కనిపించింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.