
దివ్యభారతి.. 'బ్యాచిలర్' సినిమా ద్వారా తమిళ చిత్రసీమలో స్టైలిష్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. జి.వి.ప్రకాష్ సరసన నటించి తొలి చిత్రం యూత్‌ని ఆకట్టుకుంది.

ప్రస్తుతం కతీర్ మలయాళ చిత్రం ఇస్కిన్ తమిళ 'ఆసై' తమిళ రీమేక్‌లో నటించడం పూర్తి చేసింది. బ్యాచిలర్ సక్సెస్ తర్వాత జి.వి.ప్రకాష్ - దివ్య జంటగా మళ్లీ నటిస్తున్న చిత్రం 'కింగ్ స్టన్ '.

అటు తెలుగులోనూ సుడిగాలి సుధీర్ సరసన కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది దివ్యభారతి. ఈ మూవీతో ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది.

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే దివ్యభారతి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్, క్రేజీ వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా సాగర తీరాన సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం దివ్యభారతి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సాగర తీరాన అందాల దేవకన్య.. హృదయాలను కొల్లగొట్టేస్తోన్న దివ్యభారతి.. బ్యూటీఫుల్ ఫోటోస్..