అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ నటి దిశా పటానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. లోఫర్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు.
కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ వరస సినమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలతో కుర్రకారును మాయ చేస్తుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో పలు ఫోటోలు పోస్టు చేసింది. అందులో ఐపీఎల్ ఓపెనింగ్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
దిశా తాజాగా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరోమణిలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. క్రిస్టల్స్‌తో తయారు చేయించిన డ్రెస్‌లో తన అందాలను ఆరబోతస్తూ, డ్యాన్స్ పుర్ఫామెన్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో, దిశా పటాని అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్ముడు అభిమానులు.