- Telugu News Photo Gallery Cinema photos Beautiful actress sri divya latest black colour saree photos goes viral
Sri Divya: ఆహా.. ఆ నవ్వు చాలు ఎలాంటి కుర్రాడైనా ప్రేమలో పడిపోవాల్సిందే..
శ్రీదివ్య.. తెలుగులో తక్కువ తమిళ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1993 ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో జన్మించింది శ్రీదివ్య. ఆమె అక్క శ్రీరమ్య కూడా తెలుగు, తమిళ సినిమాలలో నటించింది. శ్రీదివ్య తన చిన్నతనం నుంచే నటన పట్ల ఆసక్తి చూపింది. అలాగే మూడేళ్ల వయసు నుండి నటించడం ప్రారంభించింది.
Updated on: Mar 24, 2025 | 2:12 PM

శ్రీదివ్య.. తెలుగులో తక్కువ తమిళ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1993 ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో జన్మించింది శ్రీదివ్య. ఆమె అక్క శ్రీరమ్య కూడా తెలుగు, తమిళ సినిమాలలో నటించింది. శ్రీదివ్య తన చిన్నతనం నుంచే నటన పట్ల ఆసక్తి చూపింది. అలాగే మూడేళ్ల వయసు నుండి నటించడం ప్రారంభించింది.

శ్రీదివ్య మొదట తెలుగు టెలివిజన్ సీరియళ్లలో నటించింది, ఉదాహరణకు "శ్రావణ మేఘాలు" మరియు "తూర్పు వెళ్ళే రైలు". ఆ తర్వాత ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

శ్రీదివ్య తన సినీ జీవితాన్ని బాలనటిగా ప్రారంభించింది. 2006లో వచ్చిన తెలుగు చిత్రం "భారతి"లో నటించి, ఉత్తమ బాలనటిగా నంది అవార్డును గెలుచుకుంది. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా "హనుమాన్ జంక్షన్", "యువరాజ్", "వీడే" వంటి చిత్రాలలో కూడా నటించింది.

హీరోయిన్‌గా ఆమె తొలి చిత్రం 2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం "మనసారా". ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత 2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన "బస్ స్టాప్" చిత్రంలో నటించింది, ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. తెలుగులో హీరోయిన్ గా మనసారా, బస్ స్టాప్, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు వంటి సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ దివ్య తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.