
స్క్రీన్ మీద సక్సెస్ అయిన సినిమాకు తీసే సీక్వెల్‌లో సేమ్ జోడీలను రిపీట్ చేయొచ్చు. కొత్త జంటలనూ సెలక్ట్ చేసుకోవచ్చు. కథ కొత్తదైనా, పాత జోడీని రిపీట్ చేస్తున్నారంటే... హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అవుతుందనే కాన్ఫిడెన్స్. సెట్స్ మీదున్న కొన్ని సినిమాల్లో అలాంటి నమ్మకం పుష్కలంగా కనిపిస్తోంది.

వీడియో చూశారు కదా... చందు మొండేటి, నాగచైతన్య సినిమాలో ఆమే హీరోయిన్. ఎవరామె అంటారా? డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి. ఆల్రెడీ లవ్‌స్టోరీలో నాగచైతన్యతో జోడీ కట్టారు సాయిపల్లవి. గత కొన్నాళ్లుగా సినిమాలకు సైన్ చేయకుండా సైలెంట్‌గా ఉన్న ఈ క్వీన్ ఇప్పుడు మళ్లీ చైతూ సినిమాకు పచ్చజెండా ఊపడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.

నాగచైతన్య - సాయిపల్లవి జోడీ రిపీట్ అవుతుందనే వార్త వైరల్ కాగానే, సేమ్ ఇలా రిపీట్ అవుతున్న జోడీల మీద ఫోకస్ పెరుగుతోంది. వినయవిధేయ రామా సినిమాలో జంటగా నటించిన రామ్‌చరణ్ - కియారా కూడా ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో నటిస్తున్నారు. 2024లో విడుదలకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్.

ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న లియో సినిమాలో విజయ్ సరసన నటించారు త్రిష. మామూలుగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద స్కోప్ ఉండదు. కానీ, లియో సినిమాలో త్రిషకు బెస్ట్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారట లోకేష్. అందుకే దళపతితో చెన్నై సుందరిని మరోసారి చూడటానికి రెడీ అవుతున్నారు జనాలు.

మెగాస్టార్ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క నటిస్తారని, టాలీవుడ్ హిట్ పెయిర్ రవితేజ - శ్రీలీల మరోసారి జోడీ కడతారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.