
మొన్నమొన్నటిదాకా రాజకీయాల్లో తిరిగిన బాలయ్య త్వరలోనే సెట్స్ కి వస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన మళ్లీ మేకప్ వేసుకునేది ఎప్పుడు? ఆయన సినిమాల స్టేటస్ ఏంటి? అంటూ ఆరాలు మొదలయ్యాయి.... ఇంతకీ పవర్‌స్టార్ మనసులో ఏముంది?

పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీగా ఉన్నారు పవర్‌స్టార్ ఫ్యాన్స్ . పొలిటికల్‌గా అంతా ఓకే, మరి పెండింగ్‌లో ఉన్న సినిమాల సంగతేంటి? పవన్‌కల్యాణ్ మనసులో ఏముంది? ఈ సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే చర్చలు మాత్రం ఆగడం లేదు. పవన్‌కల్యాణ్ ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసి, స్పీడ్‌గా చేసిన ఓజీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి కూడా వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.

ఓజీ మాత్రమే కాదు, హరిహరవీరమల్లు కూడా ఈ ఏడాదే థియేటర్లలో సందడి చేస్తుందని చాలా సంబరపడ్డారు పవర్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్‌స్టార్ కాల్షీట్ ఇచ్చేదాన్ని బట్టే ఈ ప్రాజెక్టుల్లో కదలిక రావాలి.

త్వరలోనే తన నిర్మాతలను కలిసి సెట్స్ మీదున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలనుకుంటున్నారట పవర్‌స్టార్. హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజ మూవీతో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా పూర్తి చేసి, మళ్లీ ఉస్తాద్ మీద ఫోకస్ చేయడానికి ఆయనకు కొంచెం సమయం పడుతుంది. అందుకే ముందు ఓజీ, ఆ వెంటనే హరి హరవీరమల్లుని కంప్లీట్ చేస్తారు పవర్‌స్టార్. ఫైనల్‌గా హరీష్ సెట్స్ లోకి వెళ్తారన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్.