
స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండో వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోదరి ప్రముఖ హీరోయిన్ అదితి శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు ఐశ్వర్య ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో కాబోయే దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

డైరెక్టర్ శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐశ్వర్యా శంకర్ డాక్టర్ గా కొనసాగుతుంటే, రెండో కూతురు ఐశ్వర్య మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తోంది. హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తోంది అదితీ శంకర్.

ఐశ్వర్యకు 2021లో ప్రముఖ క్రికెటర్ రోహిత్ దామోదర్ తో వివాహమైంది. మహాబలిపురంలో ఎంతో ఘనంగా వీరిద్దరి వివాహం జరిగింది. అయితే విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు.

భర్తతో విడిపోయిన ఐశ్వర్య తన తండ్రి శంకర్ తోనే ఉంటోంది. ఇప్పుడు రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగపెట్టనుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌తో తాజాగా నిశ్చితార్థం జరిగింది.

తరుణ్ కార్తికేయన్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు.పాటల రచయిత, నేపథ్య గాయకుడు కూడా. త్వరలోనే ఐశ్వర్య, తరుణ్‌ల పెళ్లితేదీని ప్రకటించనున్నారు శంకర్ కుటుంబ సభ్యులు.