Krish: క్రిష్ టైమింగ్ మిస్సయిందా.. సినిమాలు టైమ్‌కు ఎందుకు రావట్లేదు..?

Updated on: Apr 23, 2025 | 12:00 PM

హరిహర వీరమల్లు సినిమా వదిలేసుకుని దర్శకుడు క్రిష్ ఏం సాధించారు..? పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యమవుతుందనే కదా.. మరో ప్రాజెక్ట్ ఓకే చేసారీయన. మరి ఆ సినిమా కూడా ఇప్పుడు లేట్ అవుతుంది. మరి వీరమల్లు వదిలేసుకుని క్రిష్ సాధించిందేంటి..? అసలు ఈయన సినిమాలు ఎందుకు అనుకున్న టైమ్‌కు రావట్లేదు..?

1 / 5
ఒకప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే.. పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ టైమ్‌కు రిలీజ్ చేస్తానంటే.. రిలీజ్ చేసేవాడు అంతే. అందులో ఒక్కరోజు కూడా ఆలస్యం ఉండేది కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లో.. ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలను 79 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత క్రిష్ సొంతం.

2 / 5
చాలా వేగంగా సినిమాలు తెరకెక్కిస్తారు అనే పేరు క్రిష్‌కు ఉంది ఇండస్ట్రీలో. అంతెందుకు హరిహర వీరమల్లు మొదలుపెట్టిన తర్వాత.. కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనూ తక్కువ మంది టీంతో కొండపొలం సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేసారు క్రిష్.

3 / 5
అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న క్రిష్ ఈ మధ్య ఒక్క సినిమా కూడా టైమ్‌కు పూర్తి చేయట్లేదు. ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ ఒప్పుకున్నారో తెలియదు గానీ.. అప్పట్నుంచే ఆయన సినిమాలు టైమ్‌కు రావట్లేదు. 

4 / 5
హరిహర వీరమల్లు సినిమా కోసం రెండేళ్లకు పైగానే కష్టపడ్డారు ఈ దర్శకుడు. ఆలస్యం అవుతుండటంతో క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత వీరమల్లును టేకప్ చేస్తున్నారు ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ.

5 / 5
హరిహర వీరమల్లు నుంచి బయటికొచ్చేసి.. అనుష్క శెట్టి ఘాటీ సినిమాతో బిజీ అయిపోయారు క్రిష్. ఈ సినిమా షూటింగ్ అయిపోయినా కూడా ఇప్పటికీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. ఏప్రిల్ 18న విడుదలన్నారు గానీ ఆ డేట్ వెళ్లిపోయినా.. ఇప్పటికీ సైలెంట్‌గా ఉన్నారు మేకర్స్. మొత్తానికి వీరమల్లు వదిలేసిన తర్వాత కూడా క్రిష్‌కు ఆలస్యం అయితే తప్పట్లేదు.