
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఒక అన్వి రెడ్డి అనే బాబు ఉన్నాడు.

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో చనిపోయింది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2020లో తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2022లో ఈ దంపతులకు అన్వి రెడ్డి అనే కుమారుడు జన్మించాడు.

దిల్ రాజు, తేజస్వినిల పరిచయం ఒక ఫ్లైట్ లో జరిగిందట. ఆ తర్వాత అది ప్రేమగా మారడం, ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కామని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది తేజస్విని.

గతంలో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేది కాదు తేజస్విని. అయితే ఇప్పుడు మాత్రం నెట్టింట చురుగ్గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది.

భర్తతో కలిసి దిగిన వెకేషన్, టూర్స్ ఫొటోలు, పండగలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది తేజస్విని.

అలా తాజాగా బ్లాక్ సారీలో ఎంతో అందంగా కనిపించింది తేజస్విని. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.