
భోళా శంకర్ తర్వాత చిరు ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఓ వైపు ఒరిజినల్ స్టోరీస్‌తో రజినీ, కమల్, బాలయ్య లాంటి సీనియర్స్ వరస విజయాలు అందుకుంటుంటే.. చిరు మాత్రం రీమేక్స్ నమ్ముకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి. దాంతో బ్రో డాడీ రీమేక్ అంటూ ప్రచారం జరుగుతున్న 156వ సినిమాను హోల్డ్‌లో పెట్టి.. ముందు వశిష్ట సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు మెగాస్టార్.

కూతురు సుష్మిత బ్యానర్‌లో చేయాలని సినిమాకు కథ సెట్ అవ్వలేదు. దాంతో నవంబర్ నుంచి వశిష్ట తెరకెక్కించబోయే సోషియో ఫాంటసీ పట్టాలెక్కడం ఖాయమైపోయింది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ఆల్రెడీ తమన్నా రెండు సినిమాలు చేసారు.. నయన్‌తోనూ 2 సినిమాలు చేసారు చిరు. పైగా గాడ్ ఫాదర్‌లో చెల్లిగా నటించారు. దాంతో అనుష్క వైపు దర్శక నిర్మాతల చూపులు వెళ్తున్నాయి.

చిరుతో ఇప్పటి వరకు నటించని సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మాత్రమే. స్టాలిన్‌లో స్పెషల్ సాంగ్ మినహాయిస్తే.. హీరోయిన్‌గా నటించలేదు. దాంతో మెగా 157లో ఆమె అయితే బాగుంటారని భావిస్తున్నారు మేకర్స్.

ఈ మేరకు చర్చలు మొదలైనట్లు తెలుస్తుంది. మరోవైపు మృణాళ్ ఠాకూర్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా చిరు మాత్రమే కాదు.. 60 ప్లస్ హీరోలకు జోడీ వెతకడం దర్శకులకు కష్టమైపోతుంది.