
2010లో ఓ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు హరీశ్ ఉత్తమన్. ఆ తర్వాత దక్షిణాదిన అన్ని భాషల్లో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

పవర్, గౌరవం, ‘శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాథం కృష్ణ గాడి వీర ప్రేమగాథ, ఎక్స్‌ప్రెస్ రాజా, జై లవకుశ’, అశ్వద్ధామ, వి, నా పేరు సూర్య, నాంది, కంగువా తదితర సినిమాల్లో హరీశ్ ఉత్తమన్ నటించి మెప్పించాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే హరీశ్ కు 2018 లోనే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌పుర్‌తో వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఏడాదికే విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక 2022 జనవరిలో మలయాళ ప్రముఖ నటి చిన్ను కురువిలను రెండోసారి వివాహం చేసుకున్నాడు హరీశ్. ‘నార్త్ 24 కతమ్’, ‘కసాబా’, ‘లుక్కా చుప్పి’ తదితర చిత్రాలతో మలయాళ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్న కురువిల.

ఇటీవల ఈ జంట తమ వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ ఇన్‌స్టాలో స్పెషల్ వీడియోను షేర్ చేశారు

హరీశ్ ఉత్తమన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఈ విలన్ చేతిలో ఉన్నాయి.