Lokesh Kanagaraj: ఆ ఇరిటేషన్‌తోనే లోకేష్‌ సినిమాల్లోకి వచ్చారా?

| Edited By: Prudvi Battula

Oct 18, 2023 | 11:22 AM

లైఫ్‌లో ఇలానే బతకాలనే ఓ గ్రాఫ్‌ ఎప్పుడూ డిజైన్‌ చేసుకోలేదని అంటున్నారు ఫేమస్‌ యంగ్‌ డైరక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌. తాను చదివిన చదువుకూ, ఇప్పుడు తాను చేస్తున్న పనికీ సంబంధమే లేదని చెబుతున్నారు లోకేష్‌. చదువు పూర్తయ్యాక కార్పొరేట్‌ బ్యాంక్‌లో పనిచేశారు లోకేష్‌. తన ఉద్యోగంలో భాగంగా ఆ బ్యాంక్‌ కోసం యాడ్స్ చేసేవారు. షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్‌ ఉందని తెలిసినప్పుడు, ఆ అనుభవంతోనే తనవంతుగా ప్రయత్నించారు. కృషికి ఫలితం దక్కింది. షార్ట్ ఫిల్మ్‌కి అందిన రిసెప్షన్‌ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారట లోకేష్‌. ఆ ఆనందంతోనే 'ఇదే నా జాబ్‌' అని ఫిక్సయ్యారట.

1 / 5
ఫస్ట్ నుంచి ఉద్యోగాలు చేయకూడదు... ఏదో ఒక వృత్తి చేయాలనే ఉద్దేశం ఉండేదట లోకేష్‌కి. అయితే, ఆర్థికపరిస్థితుల కారణంగా వ్యాపారం చేయడం కుదరలేదట. ఆ తర్వాతే తనకు సినిమాల మీద ఎక్స్ పోజర్‌ పెరిగిందని అంటారు లోకేష్‌. తన సొంతూరిలో ఉన్నప్పుడు predator, commando, rocky, Rambo తరహా సినిమాలు చూసేవారట. కానీ చెన్నైకి వచ్చిన తర్వాత లోకేష్‌ సినిమాను చూసే దృక్పథమే మారిపోయింది. ఆయనతో పాటు మేన్షన్‌లో ఉన్నవారు కొత్త కొత్త సినిమాల పేర్లు చెప్పేవారట. scorseses filmography, tarantino, R rated films వంటివన్నీ చూడటం వారి వల్లనేనని గుర్తుచేసుకుంటారు ఈ కెప్టెన్‌.

2 / 5
కార్పొరేట్‌ బ్యాంక్‌లో యాడ్స్ తీసినప్పుడు ఎవరి డబ్బూ వేస్ట్ కాలేదు. కానీ, మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా అనేది డబ్బుతో ముడిపడిన విషయం. అందుకే ఆచితూచి అడుగులు వేయాలన్నది లోకేష్‌ పాలసీ.

3 / 5
''ఒక పాయింట్‌ తర్వాత అన్నీ లైఫ్‌లో టయర్డ్ నెస్‌ ఇస్తాయి. ఇప్పటిదాకా నేను చేస్తున్న సినిమాలు నన్ను ఎగ్జయిట్‌ చేస్తున్నాయి. ఎగ్జయిట్‌ అయిన ప్రతి విషయాన్నీ పేపర్‌ మీద రాస్తున్నాను. ఆలోచిస్తున్నప్పుడు ఎగ్జయిట్‌ అవుతున్నాను. ప్రొడ్యూసర్‌ దగ్గర, హీరోల దగ్గర చెబుతున్నప్పుడు కూడా ఎగ్జయిట్‌మెంట్‌ ఉంది. దాన్ని జనాలకు చేరవేయడంలోనూ అదే ఎగ్జయిట్‌మెంట్‌ ఉంది. ఇప్పుడు జనాలు కూడా నా సినిమాలను చూస్తున్నారు. కానీ దానికో బ్రేకింగ్‌ పాయింట్‌ ఉంటుంది. 'వీడెప్పుడు ఇలాంటి సినిమాలే తీస్తాడు' అని జనాలు అనుకోసాగుతారు. అలాంటప్పుడు నేను నా పనికి బ్రేకులు వేస్తాను. అక్కడ నుంచి జోనర్‌ మార్చుకుంటాను. కానీ యాక్షన్‌ మోడ్‌లో కథ చెప్పడంలో ఉన్న హై, నాకు మరే జోనర్‌ కూడా ఇవ్వలేదనిపిస్తోంది. అలా నేను ఎంజాయ్‌ చేయలేకపోయిన క్షణంలో సినిమాలు తీయను" అని అన్నారు లోకేష్‌.

4 / 5
ఆ మధ్య ఓ హారర్‌ సబ్జెక్టు రాసుకున్నారు ఈ కెప్టెన్‌. అయితే, దానికి తనకన్నా, తన స్నేహితుడైతే న్యాయం చేయగలుగుతారనే అభిప్రాయానికి వచ్చేశారట. లోకేష్‌ని భయపట్టే మరో ఫేమస్‌ జానర్‌ ఏంటో తెలుసా? రొమాంటిక్‌ జోనర్‌. రొమాంటిక్‌ సినిమాలు చేయడం అనే ఆలోచన కూడా రాదట లోకేష్‌. అంతగా భయపడుతారట ఆ జోనర్‌ చూసి..!

5 / 5
విజయ్‌ హీరోగా లోకేష్‌ డైరక్షన్‌లో తెరకెక్కిన లియోలో తొలిసారి కొన్ని రొమాంటిక్‌ సీన్స్ తీయడానికి ట్రై చేశారట లోకేష్‌. ఈ నెల 19న సినిమా చూసిన వారు ఏమంటారో తెలుసుకోవాలని ఉందని చెబుతున్నారు ఈ ప్రముఖ దర్శకుడు. 