
హీరోలు ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తుంటారు. కానీ హీరోయిన్లు అలా కాదు. ఒకే సమయంలో మల్టిపుల్ ప్రాజెక్టులను ఓకే చేసేస్తుంటారు. కాల్షీట్లు అటూ ఇటూ సర్దుతూ, ఏక సమయంలో పలు ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఇప్పుడు దీపిక పదుకోన్ కూడా ఓ బిగ్ ప్రాజెక్టును కంప్లీట్ చేసేశారు.

ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది ఫైటర్. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. హృతిక్, దీపిక కలిసి నటిస్తున్నారనే అనౌన్స్ మెంట్‌కే గూస్‌బంప్స్ వచ్చాయి ఫ్యాన్స్ కి.

చాన్నాళ్లుగా షూటింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కూడా కీ రోల్స్ చేశారు. ''హృతిక్ రోషన్, దీపికను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడంతో నా జీవితాశయం నెరవేరినట్టు అనిపిస్తోంది. ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కి కూడా ఇది చాలా పెద్ద శుభవార్త'' అంటూ డైరక్టర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అప్పట్లో అందరినీ మెప్పించింది.

అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ పూర్తవుతుందా? ఎప్పుడెప్పుడు స్క్రీన్స్ మీదకు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు జనాలు. వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి రానుంది ఫైటర్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.

దీపిక పదుకోన్ సౌత్‌లో కల్కిలో నటిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కల్కి. మోకాలి సర్జరీ పూర్తయ్యాక ప్రస్తుతం ఫారిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు డార్లింగ్. త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. రాగానే ప్రశాంత్ నీల్ సినిమాలో పార్టిసిపేట్ చేస్తారని టాక్. ఆ టైమ్‌కి దీపిక కూడా ఉత్తరాదిన ఉన్న పనులు పూర్తి చేసుకుని ఈ సెట్స్ కి వచ్చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి.