
దీపిక పదుకోన్.. మొన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్. మూలాలు సౌత్‌వే అయినా, ఎక్కువగా ఆమె అక్కడే ఫోకస్ చేశారు కాబట్టి, మనకు దీపిక నార్త్ నాయిక అనే ఫీలింగ్ బాగా ఉండేది. కానీ, ఇప్పుడు దీపికను సౌత్ మరింతగా ఓన్ చేసుకుంటోంది.

అందుకే దీపికకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. లాస్ ఏంజెల్స్ లోని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో దీపిక పదుకోన్‌కి ఓ స్టార్‌ని కేటాయించారు ఆర్గనైజర్స్. ఈ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్ చేశారు దీపిక.

ఇప్పుడంటే మెటర్నిటీ లీవ్స్ లో ఉన్నారు కానీ, లేకుంటే సెట్స్ మీద మల్టిపుల్ సినిమాలు ఉండేవే ఈ లేడీ చేతిలో. మోషన్ పిక్చర్స్ కేటగిరీలో స్టార్‌ని సొంతం చేసుకున్నారు దీపిక పదుకోన్.

హాలీవుడ్ బూలవాడ్‌లో వాక్ ఆఫ్ ఫేమ్ లొకేట్ అయింది. అక్కడ స్టార్‌ని మెయింటెయిన్ చేయడం కోసం 72 లక్షలకు పైగా స్పాన్సర్‌షిప్ ఫీ కింద పే చేయాలి దీపిక పదుకోన్.

ప్రభాస్ స్పిరిట్ నుంచి బయటకు వచ్చిన దీపిక, త్వరలోనే కల్కి2 సెట్స్ లో జాయిన్ అవుతారు. ఐకాన్ స్టార్ - అట్లీ సినిమాలో ఆమే మెయిన్ లీడ్. నార్త్ లోనూ షారుఖ్ కింగ్‌తో సహా క్రేజీ ప్రాజెక్టుల్లో వినిపిస్తోంది దీపిక పేరు.