నెరు మాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్ చేసినా.. అక్కడ కూడా డంకీ, సలార్ కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని, థియేటర్లు దొరకడం కష్టమేనని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఇందులో దృశ్యం, దృశ్యం 2 సూపర్ హిట్ కాగా, 12th Man దారుణంగా ఫెయిల్ అయ్యింది. అయినా మరోసారి జీతూకి ఛాన్స్ ఇచ్చారు మోహన్‌లాల్.